ఈ మరణము కాదు శాశ్వతము
పరలోకమే మనకు నివాసము
యేసు తెచ్చెను మనకు రక్షణ
ఎంత అద్బుతము ఆ నిరీక్షణ

జగతు పునాది వేయక ముందే
మనమెవ్వరో ఎవరికి తెలియక ముందే
మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు

తిరిగి తన దరికి మనల పిలిచే వేళ
తిరిగి తన దరికి మనల పిలిచే వేళ

యేసు నామమును ఎరిగిన వారు
పాప శ్రమలకు అర్హులు కారు
తిరిగి లేచెదరు యేసు నామములో
కొలువు తీరెదరు పరలోకంలో
కొలువు తీరెదరు పరలోకంలో

కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును
మరణము మబ్బులను కరిగించును
వేదనలు రోదనలు రద్దు చేయును

గతకాల సంగతులు గతించి పోవును
గతకాల సంగతులు గతించి పోవును

www.christsquare.com