ఏగెదను నే చేరెదను
సీయోనును నే చూచెదను
విశ్వాస కర్తయైన నా యేసూ
నీ సముఖములో నే మురిసెదను
నీ కౌగిలిలో ఉప్పొంగెదను
జీవ కిరీటమును నే పొందెదను

భూదిగంతములకు నీ కాడిని – నే మోయుచున్నాను
యేసూ నీ యొద్దనే నాకు – విశ్రాంతి దొరుకును
దినదినము నాలో నే చనిపోవుచున్నాను
అనుదినము నీలో బ్రతుకుచున్నాను
అనుదినము నీలో బ్రతుకుచున్నాను

నా ఆత్మీయ పోరాటములో దేవా – నీవే నా కేడెము
సదా నిన్నే నేను ధరియించి – సాగిపోవుచున్నాను
మంచి పోరాటముతో నా పరుగును
కడముట్టించి జయమొందెదను
విశ్వాసములో జయమొందెదను

www.christsquare.com