ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును
ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును
నిన్ను ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును

రక్తం కార్చిన రక్షకుడా – కనికర సంపన్నుడా
కనికర సంపన్నుడా – అయ్యా కనికర సంపన్నుడా

అభిషేకించి ఆదరించినా – ఆదరణ నాయకుడా
ఆదరణ నాయకుడా – అయ్యా ఆదరణ నాయకుడా

నీ పాదాల దరి చేరి – తనివి తీరా ముద్దాడెదన్
తనివి తీరా ముద్దాడెదన్ – అయ్యా తనివి తీరా ముద్దాడెదన్

నిన్ను విడచి వేరెవ్వరు – ఉత్తముడా నీవేనయ్యా
ఉత్తముడా నీవేనయ్యా – అయ్యా ఉత్తముడా నీవేనయ్యా

రాకడలో కొనిపోదువు – నీతో నేనుందును
నీతో నేనుందును – అయ్యా నీతో నేనుందును

www.christsquare.com