ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య
కృపలను పొందుచు కృతజ్ఞాత
కలిగి

స్థుతులర్పించేదను అన్ని వేళలా
అనుదినము నీ అనుగ్రహమే - ఆయుష్కాలము నీ వరమే-

ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరణీయక
ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు

నా భారము బాపి బాసటగా నిలిచి ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము

నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైనబండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే

నా ప్రతి క్షణమును నీవు దీవెనెగా మార్చి నడిపించుచున్నావు - ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (

నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా - బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా ఎడ చాలున్నంటివే

నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము

www.christsquare.com