హల్లెలూయ పాట – యేసయ్య పాట
పాడాలి ప్రతి చోట – పాడాలి ప్రతి నోట
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
కష్టాలుయే కలిగినా – కన్నీరుయే మిగిలినా
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా
చెరసాలలో వేసినా- సంకెళ్లు బిగియించినా
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా
నీ తల్లి నిను మరిచినా – మరువడు నీ దేవుడు
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా
శోధనలు నిను చుట్టినా – సంతోషమే తట్టినా
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా
సింహాల కెరవేసినా – అగ్నిలో పడవేసినా
ధీరుడవై సాగుమా – ప్రభు సిల్వనే చాటుమా