హల్లేలూయని పాడరండి
విజయుడైన యేసునకు
మరణము గెలిచె గదా
మహిమతో లేచె గదా

పాప బలము మరణ భయము
లేదు ఈ జగతిలో
మరణపు ముళ్ళు విరిచివేసెను
నిత్య జీవమిచ్చెనుగా

ఖాళి సమాధి కనుపరచెనుగా
పునరుత్తాన వార్తను
జీవము నిండిన దేవుడిలలో
యేసు క్రీస్తు ప్రభువొక్కడే

www.christsquare.com