హీనమైన బ్రతుకు నాది – ఘోర పాపిని
దాపు జేరితిని శరణు కోరితిని
దిక్కు నీవే నాకు ఇలలో
లేరు ఎవ్వరు నాయను వారు

మనిషికి మమత ఉన్నందుకా – గుండె కోత
మదిలో నిన్ను నింపుకున్నందుకా – విధి రాత
కరుణించి నన్ను కష్టాలు బాపు
కరుణామయా క్రీస్తేసువా

తల్లి తండ్రి కన్న మిన్న – నీ మధుర ప్రేమ
భార్య భర్తల కన్న మిన్న – మారని నీ ప్రేమ
పాపి కొరకు ప్రాణమర్పించిన
త్యాగ శీలివి నీకే స్తోత్రము

నిన్న నేడు రేపు యేసు – మారనే మారవు
లోకులంత మారిపోయిన – స్థిరమైన వాడవు
వెరువను జడియను
నీ కంటి పాపను నను కాచే దైవమా

www.christsquare.com