చేయి పట్టుకో నా చేయి పట్టుకో
జారిపోకుండా నే పడిపోకుండా
యేసు నా చేయి పట్టుకో (2) ||చేయి||

కృంగిన వేళ ఓదార్పు నీవేగా
నను ధైర్యపరచు నా తోడు నీవేగా (2)
మరువగలనా నీ మధుర ప్రేమను (4)

యేసు నా జీవితాంతము
యేసు నా జీవితాంతము ||చేయి||

శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా
విశ్వాస నావలో కలకలమే రేగిననూ (2)
విడువగలనా ఒక నిమిషమైననూ (4)

www.christsquare.com