ఇది దేవుని నిర్ణయము
మనుష్యులకిది అసాధ్యము
ఏదేను వనమందు
ప్రభు స్థిరపరచిన కార్యము
ప్రభు స్థిరపరచిన కార్యము
ఈ జగతి కన్నా మునుపే
ప్రభు చేసెను ఈ కార్యము
ఈ ఇరువురి హృదయాలలో
కలగాలి ఈ భావము
నిండాలి సంతోషము
వరుడైన క్రీస్తు ప్రభువు
అతి త్వరలో రానుండెను
పరలోక పరిణయమే
మనమెల్లరము భాగమే
మనమెల్లరము భాగమే