ఇకనైన కానీ ఇప్పుడైన కానీ
దర్శించగా రావా
అభిషేకం లేక దర్శనము రాక
నశియించుచున్నానయ్యా

కావలివాడు ఉదయం కోసం
మెలుకువ కలిగి చూచునట్లుగా
నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా
నా జీవం నీవేనయ్యా

ఎండిన నేల వర్షం కోసం
నేలను విరచి చూచునట్లుగా
నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా
నా జీవం నీవేనయ్యా

దుప్పి నీటి వాగుల కొరకు
ఇలలో ఎదురు చూచునట్లుగా
నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా
నా జీవం నీవేనయ్యా

www.christsquare.com