ఇరువది నలుగురు పెద్దలతో – పరిశుద్ధ దూతల సమూహముతో
నాలుగు జీవుల గానముతో (2) – స్తుతియింపబడుచున్న మా దేవా
భూమ్యాకాశములన్నియును – పర్వత సముద్ర జల చరముల్
ఆకాశ పక్షులు అనుదినము (2) – గానము చేయుచు స్తుతియింపన్
కరుణారసమయ హృదయుడవు పరిశుద్ధ దేవ తనయుడవు
మనుజుల రక్షణ కారకుడా (2) – మహిమ కలిగిన మా ప్రభువా
గుప్పిలి విప్పి కూర్మితోను గొప్పగ దీవెనలిచ్చెదవు
గొర్రెల కాపరి దావీదు (2) – అయ్యెను ఎంతో మహారాజు