జీవము నిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన
రక్తము చిందించి రక్షించిన యేసు క్రీస్తు ఆరాధన
బలపరచు మము స్థిరపరచు పరిశుద్ధాత్మ ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన

నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక
నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము
మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు త్యాగము
జీవించినా మరణించినా ఇక నీకోసమె యేసయ్యా
హల్లెలూయా

జీవమునొసగు ఆత్మచే అనుదినము నను పోషించు
నీదు బాటలొ పయనింప దారిని నాకు చూపించు
చాలును నాకు నీ కృప నిత్యము నేను జీవించెద
జీవించినా మరణించినా ఇక నీకోసమె యేసయ్యా
హల్లెలూయా

www.christsquare.com