కానెన్నడు నే అనాథను
తండ్రి కానెన్నడు నే అనాథను
అయ్యా కానెన్నడు నే అనాథను (2)

నా కన్నీరు తుడుచువాడా
నేనున్నానని అన్నవాడా (2)

వెక్కి వెక్కి ఏడుపొచ్చినా
వెక్కిరింతల పాలైనను (2)

వ్యాధి బాధలెన్ని ఉన్నా
రోగములతో కృంగి పోయినా (2)
నా వైద్యుడవు నీవే యేసయ్యా
నను స్వస్థపరచుము యేసయ్యా (2)

తల్లి తండ్రీ విడిచి వెళ్లినా
బంధు జనులు వెలివేసినా (2)
నా తల్లి తండ్రీ నీవే యేసయ్యా
నా బంధు జనుడవు నీవే యేసయ్యా (2)

www.christsquare.com