కంటికి రెప్పలా నను కాచినావయ్యా
వేటగాని ఉరినుండి విమోచించావయ్యా
పాదములకు రాయి తగులకుండగా
మరణపు ఛాయలను తప్పించినావయ్యా
నీ రెక్కలే నాకు ఆశ్రయం
నీ స్వరము నాకు కేడెము
నీ కనుచూపుతో నను కాచావు
నీ పిలుపుతో నను పదిలపరిచావు
కాపరి నా కాపరి నను కాపాడె నా ఊపిరి
కాపరి నా కాపరి నీ భుజముపై నను మోసే నా కాపరి
నీ చేతి నీడలో నను దాచినావయ్యా
శత్రువులపైన విజయమునిచ్చితివయ్యా
వెయ్యి మంది పక్కన పడిన నాకేమి కాదయ్య
పదివేల మంది కూలిన పదిలముగా నుందునయ్యా
నీ హస్తమే నాకు అభయము
నీ తోడు నాకు విజయము
నీ వాక్యం నాకు ఖడ్గం
నీ కృపయే నాకు విజయము
కాపరి నా కాపరి నీ హస్తపు నీడలో కాచే నా కాపరి
కాపరి నా కాపరి శత్రువుపై విజయమునిచ్చే నా కాపరి
కాపరి నా ఊపిరి, కాపరి నా ఊపిరి
కాపరి నా ఊపిరి, కాపరి నా ఊపిరి
కాపరి నా కాపరి నను కాపాడె నా ఊపిరి
కాపరి నా కాపరి నీ భుజముపై నను మోసే నా కాపరి