1. దావీదు రాజు - దీనుడై వేడ
అవనిలో బొందిన నష్టములన్నియు
దేవా నీవు - సమకూర్చితివే

2. శత్రు సమూహపు - కుతంత్రములతో
బొత్తిగ నేను - నష్టపడితిని
మిత్రుడేసులో - సమకూర్చుము తండ్రి

3. పసరు గొంగళి - చీడ పురుగులు
నాశము చేసిన - పంటను కూర్చుమ
యేసు ప్రభూ - నిన్ను వేడుచున్నాను

4. ప్రేమ సంతోషా - నందములను
ప్రధాన యాజకా - పోగొట్టు కొంటిని
ప్రేమతో నీవు - సమకూర్చుమా

5. పాపపు విషముతో - నా పాత్ర నిండెను
ప్రభు యేసుండను - పిండిని కలుపుము
పాప మరణమును - తొలగించుమా

6. ఆత్మీయ సోమరి - తనములో నుండి
ఆత్మనష్టముల - నెన్నియో బొందితి
ఆత్మదేవా నీవు - సమకూర్చుమా

7. పాపము చేసి - పడియున్న చోటున్
ప్రాపుగ నీవు - జూపుమో ప్రభువా
కోపగించక నాపై - కృప జూపుమా

8. చేసిన పాపము - కప్పుకొనక
విశ్వాసముతో - ఒప్పుకొందున్
సిలువరక్తముతో - శుద్ధి చేయుమా

www.christsquare.com