కోఁత యజమానుండ స్తోత్రముఁ గూర్మితో నొనరింతుము ప్రీతి మీర
గ మాదు పొలములు పెరిగి పండెను గావునఁ ||కోఁత||

1. నీదు సేవకులైన వారలు నిండు మోదముఁ నొందుచు నీ దయ నొక
యేటి గ్రాసము నీ దినంబున గాంతురు ||కోఁత||

2. విత్తుకాలము కోఁతకాలము విమలమైన తలంపులు చిత్తమునఁ బుట్టించి
మాకతి క్షేమ మొసఁగితి రక్షకా ||కోఁత||

3. వేసవిని భువి మేము నాటిన విత్తనం బతిరమ్యమై భాసురంబగు పచ్చ
మొక్కయి బయలువడె నిది చిత్రము ||కోఁత||

4. జల సమాధిని వెడలి చక్కఁగ బలముతో నీ గింజలు బలుఁడు దేవుని
శక్తి చేతను బాగుగను ఫలియించెను ||గోఁత||

5. ఆ ప్రకారమె నీదు నామము నందు కాలము చేసి యా ప్రజలు దేహములు
మహిమను నందఁ జేయుము రక్షకా ||కోఁత||

6. కోఁత కార్యమువల్ల గూడను కూర్మిచే నీ బిడ్డలు నీతులను నేర్వంగఁ
జేయుము ప్రీతిగల మా రక్షకా ||కోఁత||

7. దూత లంత్య దినంబునందున కోఁత గోయుదు రంతట నా తరుణ
మున గురుగు లన్నియు నగ్నిలోఁ బడవైతురు ||కోఁత||

8. లోకమందలి గాలి వానల లోను మే మిఁక నుండక నాకమందున
దండ్రి మింటను నేకముగ జీవింతుము ||కోఁత||

9. నీవు నేర్పిన యట్లే మే మిల నిన్నుఁ బ్రతిదినమందును జీవనోపాయంపు
భుక్తిని దేవ, వేఁడఁగఁ జేయుమీ ||కోఁత||

10. మేఇన నేఁ బోషించు నన్న పానములనే వేఁడక జానుగా నాత్మలకునౌ
భో జనము వేఁడఁ నీయుమీ ||కోఁత||

11. వసుధ నినుఁ బ్రార్థించు జన జీ వంపు రొట్టెవు నీవెగా అనువు
నాదరణంబు భుక్తిని యగుము మా కిల నెప్పుడున్ ||గోఁత||

www.christsquare.com