కొండల తట్టు నేఁ గోర్కెతోడ నాదు కన్ను లెత్తెద నిప్పుడే దండియౌ
సహాయ మెచటి నుండి నాకు వచ్చునో యండయౌ ప్రభునిచే స
హాయంబు కలుగును ||కొండల||

1. ఆయన భూమ్యాకాశము లన్నిటను సృజించెఁగా యాయన యికఁ
దొట్రిల్ల నీయఁడు నీ పాదముఁ ||కొండల||

2. నిన్నుఁ గాపాడు వాఁ డెన్నఁడును గున్కఁడు పన్ను గ నిశ్రాయేల్ గా
పాడు వాఁడు కున్కఁడు ||కొండల||

3. నీకు యెహోవాయే నిజముగాఁ గాపగు నీ కుడిప్రక్కను బ్రభుం డు
నీకు నీడగా నగుఁ ||కొండల||

4. ధాత్రిఁ బగు లెండ దెబ్బ రాత్రి వెన్నల దెబ్బయే మాత్ర మైనను నిన్ను మార్కొనంగఁ జాలవు ||కొండల||

5. ఏ యపాయమును రా నీయకుండ నా యెహోవ పాయక నినుఁ
గాచును నీ ప్రాణముఁ గాపాడును ||కొండల||

6. మోదంబుతో నిది మొదలుకొని నిత్యమున్ నీదు రాక పోకలందు
నిను యెహోవా కాచును ||కొండల||

7. జనక కుమారాత్మకును ఘనత మహిమ కల్గును మును పిపుడెల్లప్పుడు యుగ ముల కగుఁ గా కామేన్ ||కొండల||

www.christsquare.com