క్రీస్తు నేడు పుట్టెను
హల్లెలూయా హల్లెలూయా
జగమంత చాటను
నిండు మనసుతో పరవసించను

రారాజు మహరాజు జన్మించే ఈ దరలో
కొనియాడి కీర్తించి ఆరాధించెదము
సంతోషమే సమాధానమే
ఆశ్చర్యమే మహదానందమే

సంతోషకరమైన శుభవార్త
కాపరులకు తెలిసే ఈ వార్త
లోకంలో లేని సంతోషం
భువిపై తెచ్చింది శుభవార్త

కృంగిన జీవితాలకు
కృపచూపెను ఈ క్రిస్మస్
భయముతో ఉన్నవారిని
బలపరచెను ఈ క్రిస్మస్

నిరీక్షణలేని జనులకు
నిరీక్షణ తెచ్చింది ఈ వార్త
రక్షణలేని జనులకు
రక్షణ తెచ్చింది ప్రభు వార్త

పాపముతో ఉన్నవారిని
పవిత్రపరచును క్రిస్మస్
బాధలలో ఉన్నవరిని
బలపర్చును ఈ క్రిస్మస్

సమాధానంలేని మనుషులకు
సమాధానం తెచ్చెను ఈ వార్త
సమాధానపరిచెను తండ్రితో
శాంతి నొసగె ఈ ప్రభువార్త

లయమయ్యే జీవితాలను
లేవనెత్తు ఈ క్రిస్మస్
వ్యధలతో ఉన్నవారిని
ఉత్తేజపరచును క్రిస్మస్

www.christsquare.com