పల్లవి
కృప వెంబడి, కృపలో నన్ను దాచావు నీ దయలో
గడచిన కాలమంతా, నన్ను కాచావు నీ నీడలో (×2)
యేసయ్యా..!

అనుపల్లవి
యేసు రాజా, నీ కృపయే మహోన్నతం
నీవు చూపిన ఆ ప్రేమ, మధురామృతం
(కృప)

చరణం 1
ఇరుకులలో, ఇబందులలో
సాయములేని వేళలో (×2)
నన్ను విడిపోలేదు నీ కృప
ఉన్నత స్థానములో నిలిపెనుగా (×2)
(కృప)

చరణం 2
వ్యధలలోన, బాధలలోన
ఆధారములేని వేళలో (×2)
నన్ను మరువలేదు నీ కృప
ఆభయం ఇచ్చి నడిపెనుగా (×2)
(కృప)

www.christsquare.com