లేచినాడురా
సమాధి గెలచినాడురా యేసు
లేతునని తా చెప్పినట్లు
లేఖనములలో పలికినట్లు

భద్రముగా సమాధిపైన
పెద్ద రాతిని ఉంచిరి భటులు
ముద్ర వేసి రాత్రి అంతా
నిద్ర లేక కావలియుండ

పాప భారము లేదు మనకు
మరణ భయము లేదు మనకు
నరక బాధ లేదు మనకు
పరమ తండ్రి యేసు ప్రభువు

యేసునందే రక్షణ భాగ్యం
యేసునందే నిత్య జీవం
యేసునందే ఆత్మ శాంతి
యేసునందే మోక్ష భాగ్యం

పాపులకై వచ్చినాడు
పాపులను కరుణించినాడు
పాపులను ప్రేమించినాడు
ప్రాణ దానము చేసినాడు

www.christsquare.com