లెక్కింపగ తరమా నీ మేలులు
వివరింపగ తరమా నీ కార్యములు
నీవిచ్చిన బహుమానం బహు శ్రేష్టము
నీకిచ్చే స్తుతియాగం స్వీకరించుము

నీ ప్రేమలోనే తను ఎదగాలి
నీ రక్షణలోనే కొనసాగాలి
నీ సన్నిధి చేరి నీ జ్ఞానముతోని

నిరతం నిన్నే స్తుతియించాలి
తన జీవితమంతా నీ రెక్కల క్రింద
నిన్నే ఎల్లప్పుడు సేవించాలి

నీ వాక్యము తన హృదిలో ఉండాలి
నీ తలంపులు మదిలో నిండాలి
నీ దయయందు మనుష్యుల దయయందు

ప్రతి యేటా దీవెనలతో వర్ధిల్లాలి
నీ ఆత్మ బలముతో స్థిరమైన మనస్సుతో
ప్రతి చోట నీ సాక్షిగ జీవించాలి

www.christsquare.com