లెమ్ము తేజరిల్లుము నీకు
వెలుగు వచ్చియున్నది
యెహోవా మహిమ నీపై
ప్రకాశముగా నుదయించె

యేసే యీ లోకమునకు
వెలుగై యున్నానని చెప్పెన్
యేసుని నమ్మువారు
వెలుగులో నడుచువారు

అంధకార మందుండి
బంధింప బడిన వారిన్
ఆశ్చర్యమైన వెలుగు
నందించి విమోచించెన్

దాత ప్రభు యేసుని నమ్మి
నీతిగా నడుచువారు
జాతి భేదములు లేక
జ్యోతుల వలె నుందురు

మనుజులు మీ సత్క్రియలను
జూచి బహు సంతోషించి
మనసారా పరమ తండ్రిన్
మహిమ పరచెదరు

జనములు నీ వెలుగునకు
పరుగెత్తి వచ్చెదరు
రాజులు నీదు ఉదయ
కాంతికి వచ్చెదరు

www.christsquare.com