బేత్లెహేము పురము నందు కన్య మరియ గర్భాన పుట్టెను రక్షకుడు యేసు
పశువులపాక లోన దేవునునిగా జన్మించెను రారాజు
దేవుడే మానవుడై పుట్టెను ఆ నాడు
లోకమంతా సంబరాలతో నిండెను చూడు

ఉల్లసింతుము - ఆరాధింతుము ...లోకాలనేలే రారాజును
ప్రకటింతుము - లోకమంతయు ...పాపము బాపే మన యేసుని

క్రీస్తు పుట్టెను - తార వెలిసెను - చీకటి అంతయు వెలుగాయెను
ఆనందము - పరమానందము కలిగించు వార్త - దూత తెలిపెను

దివి నుండి భువికి ఏతెంచెను , యూదుల రాజుగా జన్మించెను
ఈ జగతిని ఏలే రక్షకుడే మన కోసం అరుదించెను

నడిచివెళ్లిరి - జ్ఞానులందరు - తూర్పు దిక్కు చుక్క ,చూపే దారిలో
ఆరాధించిరి -బోళముతో - మనకై జన్మించిన ఆ శిశువును

అదిగో మన రక్షకుడు యేసు పుట్టెను లోకమంతా సంతోషించెను
దేవాది దేవుడే దిగి వచ్చెను పుడమే పులకించేను

www.christsquare.com