మహిమ నీకే ప్రభూ-ఘనత నీకే ప్రభూ
స్తుతి ఘనత మహిమయు – ఫ్రబావము నీకే ప్రభూ
ఆరాధనా ఆరాధనా ప్రియయేసు ప్రభునకే నా యేసు ప్రభునకే
సమీపించరాని తేజస్సునందు
వసియిoచు అమరుండవే
శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే
ఎంతో ప్రేమించి నాకై ఏతెంచి
ప్రాణము నర్పించితివే
విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే
ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి
నను పిలచి వెలిగించితివే
నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప ఏర్పరచుకొంటివే
రాజులైన యాజక సమూహముగ
ఏర్పరచబడిన వంశమై
పరిశుద్ధ జనమై నీ సొతైన ప్రజగా నన్ను జేసితివే