యేసయ్య నీవే నా ఆధారము
నా ఆశ్రయమూ నీవే
నా బలము నా కోట నా కేడెము
నా శైలము నీవే

నా మార్గములన్నిటిలో కాపాడును
నా పాదములకు రాయి తగులకుండను
కాపాడే దేవుడాయనే
నన్ను రక్షించు తండ్రి ఆయనే

వేటకాని ఉరిలోనుండి
నాశనకరమైన తెగులునుండి
నన్ను కాపాడే దేవుడాయనే
నన్ను రక్షించు తండ్రి ఆయనే

రాత్రులు కలుగు భయముకైనను
పగటిన ఎగురు బాణమునకైనను
తన రెక్కలతో నన్ను కప్పును
తన చేయి నాతో నడుచును

www.christsquare.com