నజరేతువాడా - నిన్ను చూడాలి
నా యేసునాధా - నిన్ను చేరాలి
నీదు రక్తధారలె నను కడగాలి
నీదు సాక్షిగ - నేను బ్రతకాలి

హల్లెలూయ పాటలు ఆనంద గీతికలు
నా జీవిత కాలమంతా గాన మాలపించాలి

నీ స్వస్థత కావాలి - నీదు మాటలే వినాలి
నా జీవిత కాలమందు - నీ గానము చేయాలి
నీ రెక్కల చాటున - నేను దాగి యుండాలి
నా ప్రాణ నాధుడా - నీ స్తోత్ర గీతి పాడాలి (2)
||నజరేతువాడా||

నీదు అడుగు జాడలయందు - నేను సాగిపోవాలి
నీజల్దరు నీడలోన - నేను విశ్రమించాలి
భూదిగంత వాసులంతా - నీవే రారాజు వనుచు
నీ దివ్య సన్నిధి చేరి - నవ్యగీతి పాడాలి
||నజరేతువాడా||

నీ నామము ఎరుగని వారి కడకు నేను పోవాలి
నీ దివ్య ప్రేమ సువార్త - లోకమందు చాటాలి
నీ సిలువ శాంతిలో - నీ కరుణ కాంతిలో
నా జీవిత కాలమంతా - నేను సాగిపోవాలి
||నజరేతువాడా||

www.christsquare.com