నే వేచియుంటిని నీదు స్పర్శకై
నిలచియుంటినీ నీదు దర్శనంబుకై
జీవమా ప్రియ యేసువా
నేస్తమా ఘన దైవమా
॥ నే వేచియుంటిని॥
కఠిన శిలలైన మారిపోవునే
నీ స్పర్శలో శిల్పముగా
జిగట మన్నైన రూపొందునే
నీ చేతిలో ఘన పాత్రగా
రాతిని నన్ను మలచితివే నీ రూపములో
మంటినినన్ను వాడుకొనవే నీ సేవలో
॥ జీవమా ప్రియ॥
తొలగి పోవునే ప్రతిపాపము
నీ ముఖకాంతిలో నా దేవా
శుద్ధినొందునే ప్రతిపాపియూ
నీ దర్శనములో నా ప్రభువా
పాపిని నన్ను నిలిపితివే నీ పోలికలో
నడిపించవే జాలితో నీ పరిచర్యలో
॥ జీవమా ప్రియ॥
పులకించదా నిన్ను తాకిన
ఏ తనువైనా నీ ప్రేమలో
పరవశించదా నీవు తాకిన
ఏ హృదియైనా నీ కృపలో
హర్షించదా నిన్ను చూచిన ఏ మనసైనా
ప్రహర్షించదా నీవు చూచిన ఏ బ్రతుకైనా
॥ జీవమా ప్రియ॥