నేడో రేపో నా ప్రియుడేసు
మేఘాలమీద కేతెంచును
మహిమాన్వితుడై ప్రభు యేసు
మహీతలమునకు ఏతెంచును
చీకటి కమ్మును సూర్యుని
చంద్రుడు తన కాంతినీయడు
నక్షత్రములు రాలిపోవును
ఆకాశ శక్తులు కదలిపోవును
కడబూర స్వరము ధ్వనియించగా
ప్రియుని స్వరము వినిపించగా
వడివడిగ ప్రభు చెంతకు చేరెద
ప్రియమార ప్రభుయేసుని గాంచెద
నా ప్రియుడేసుని సన్నిధిలో
వేదన రోదనలుండవు
హల్లెలూయా స్తుతిగీతాలతో
నిత్యము ఆనందమానందమే