నన్ను ప్రేమించి లోకానికి ధిగివచ్చి
నీ రక్తముతో నన్ను కొంటివా దేవా
నన్ను కరుణించి నీ చేయి అందించి
నీ రాజ్యంలో నన్ను చేర్చితివా దేవా
దేవా నీ ప్రేమ మధురం
దేవా నీ కరుణ మధురం {2}
నన్ను ప్రేమించి లోకానికి ధిగివచ్చి
నీ రక్తముతో నన్ను కొంటివా దేవా
నన్ను కరుణించి నీ చేయి అందించి
నీ రాజ్యంలో నన్ను చేర్చితివా దేవా

అమ్మ పంచిన ప్రేమకు మించిన
ప్రేమ నీది యేసయ్య
నాన్న చూపిన కరుణకు మించిన
కరుణ నీది యేసయ్య {2}
లోకములో వెదకినా దొరకనిది
ప్రేమ నీది యేసయ్య
నాపై చూపిన ప్రేమకు మించినది
లోకములో నాకు లేదయ్యా
నన్ను ప్రేమించి లోకానికి ధిగివచ్చి
నీ రక్తముతో నన్ను కొంటివా దేవా
నన్ను కరుణించి నీ చేయి అందించి
నీ రాజ్యంలో నన్ను చేర్చితివా దేవా

ప్రేమ చూపుతారు లోకములో
తమ స్వార్ధము కొరకు
ప్రేమ పంచుతారు లోకములో
అక్కర తీరేవరకు {2}
లోకములో వెదకినా దొరకనిది
ప్రేమ నీది యేసయ్య
నాపై చూపిన ప్రేమకు మించినది
లోకములో నాకు లేదయ్యా
నన్ను ప్రేమించి లోకానికి ధిగివచ్చి
నీ రక్తముతో నన్ను కొంటివా దేవా
నన్ను కరుణించి నీ చేయి అందించి
నీ రాజ్యంలో నన్ను చేర్చితివా దేవా

నీవు చూపిన ప్రేమకు మించిన
ప్రేమ ఏది లేదయ్యా
నీవు చూపిన కరుణకు మించిన
కరుణ ఏది లేదయ్యా {2}
లోకములో వెదకినా దొరకనిది
ప్రేమ నీది యేసయ్య
నాపై చూపిన ప్రేమకు మించినది
లోకములో నాకు లేదయ్యా
నన్ను ప్రేమించి లోకానికి ధిగివచ్చి
నీ రక్తముతో నన్ను కొంటివా దేవా
నన్ను కరుణించి నీ చేయి అందించి
నీ రాజ్యంలో నన్ను చేర్చితివా దేవా

www.christsquare.com