నీ సేవలో నన్ను తరియించనీ
నీ ప్రేమలో నన్ను జీవించనీ
ఆధారమా అనురాగమా నిన్నే స్తుతించి
కొనియాడెదా
నా జీవమా జయగీతమా నిన్నే స్మరించి
స్తుతిపాడెదా
యేసు నీలో నే సాగెదా

1. జీవితాన సోలిపోయా - చేరదీసి దయచూపవా
హోరుగాలి సాగరాన - చేయి చాపి దరిచేర్చవా
వేచివున్నా నే ఆశతో - బలము నింపు నీ ఆత్మతో
ఏకమై నా తోడుగా - భయము లేదు నీవుండగా
ఎదలో భారం మోసినావు - ఎంత ప్రేమ నా యేసయ్య

2. ఈ జగాన నీడ నీవై - కాచినావే కరుణాత్ముడా
ఎన్నడైనా వీడలేదే - మార్పులేని మహనీయుడా
చేరదీసే నీ స్నేహము - ఎదురుచూసే నా కోసము
నీ కృపా నా క్షేమము - మధురమైన సంకల్పము
నడిపే నన్ను నీదు కాంతి - ఎల్లవేళ నా యేసయ్యc

www.christsquare.com