నీవే నా బలమయ్య - నీవే నా
కోటయ్య
నీవే నా ఆశ్రయమయ్య - నీవే నా కాపరివయ్య

నీ దయ లేనిదే నేనేమవుదునో
నీ కృప లేనిదే నేనేమవుదునో

ఆదియందే నన్ను నీలో చూచితివి - తల్లిగర్భములోనే నన్ను ఎన్నుకొంటివి
నీరూపులోనే నన్ను మలచితివి - నీ మహిమ కొరకే ఏర్పరచితివి
ఆ రోజు నాపై నీ కృప లేనిదే
ఈ రోజు నీ దయలో నేనిలలేనయ్య

నీ పిలుపు లేనిదే నేనేమవుదునో
నీ చిత్తము లేనిదే నేనేమవుదునో

యేసయ్యా... నేనేమవుదునో....
యేసయ్యా... నేనేమవుదునో...

నా పాపమే నన్ను నీకు దూరము చేసిన -
నా దోషమే నన్ను మరణమునకే నడిపిన
నన్ను తిరిగి తెచ్చుటకు నీలో ఏకమవ్వుటకు ‌‌‌‌

నీకు నీవుగా నాకై బలమైతివి
ఆ రోజు నన్ను నీవు వెదకి వుండలేనిదే
ఈరోజు నీతో కలిసుండలేనయ్య

నీ రక్తము లేనిదే నేనేమవుదునో
నీ యాగము లేనిదే నేనేమవుదునో

www.christsquare.com