నిన్ను నేను విడువనయ్యా దేవా
నన్ను దీవించు వరకు (2)

అబ్రహాము దేవా ఇస్సాకు దేవా
యాకోబును దీవించిన దేవా (2) - || నిన్ను నేను ||

నా తోడై ఉంటానన్నావే నే వెళ్ళు ప్రతి చోటా
నను దీవించు వరకు విడువనన్నావే (2)
తల్లి మరచినా నా తండ్రి విడిచినా (2)
కునుకక నిదురపోక నను చూస్తున్నావు దేవా (2)-|| అబ్రహాము దేవా ||

గొప్ప ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే
నీ కన్నా గొప్ప కార్యాలు చేసెదనన్నావే (2)
మనుష్యుడవు కాదు నీవు మాట తప్పుటకు (2)
అన్ని గతించిన నీ మాట శాశ్వతము (2)-|| అబ్రహాము దేవా ||

www.christsquare.com