నిన్ను విడచి క్షణమైన నే మనలేను
నిన్ను మరచి కలనైన ఊహించలేను
తలపులో నిలిపేది నిన్నే
పలుకులో పిలిచేది నిన్నే

నేనెలా మరతునో ప్రభూ..
నాపై నీకు .. ఉన్న ప్రేమనూ ..
నేనెలా వివరింతునో ప్రభూ ..
నీపై నాకు .. ఉన్న ప్రేమనూ ..

జుంటి తేనె ధారలకన్నా
మధురమైనది నీదు ప్రేమ..
సుగంధ వర్గ చూర్ణము కన్నా
పరిమళ భరితం నీదు ప్రేమ .. (ఆ .ఆ ..ఆ ..)

మహిమాసనమే వీడి నీవు
మహిలో నాకై వెలసినావు ..
నీవే నా పరవశం
నీ ప్రేమే అతిశయం

షారోను లోయలో విరిసే పద్మముకు
సువాసనాయే నీదు ప్రేమ ..
షాలేము పురిలో వెలిగే దివ్వెలకు
కాంతి తరంగమే నీదు ప్రేమ… (ఆ..ఆ..ఆ..)

కలువరి సిలువను గెలిచిన దేవా
కరుణను పరముకు నను గొనిపోవ..
నీవే నా ప్రాణప్రియం
నీ ప్రేమే పరివేషణం...

www.christsquare.com