ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది
యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు
భయపడకు నేను నీ
కేడెమును బహుమానమున్
అత్యధికముగా చేతునని
యెహోవా దేవుడే పల్కెన్
సర్వోన్నతుని రాజ్యము
శాశ్వతంబు నిక్కము
తొలగిపోదు ఎన్నడూ
లయము కాదు ఎన్నడూ
నీవు భయపడకుము
బాధించువారు రాకుండను
దూరముగా నుంచి యున్నాను
నీకు తోడైయున్నాను