ఒంటరివి కావు ఏనాడు నీవు
నీ తోడు యేసు ఉన్నాడు చూడు
ఆలకించవా ఆలోచించావా
ఆనందించవా
వెలివేసారని చింతపడకుమా
ఎవరూ లేరని కృంగిపోకుమా
ఒంటరితనమున మదనపడకుమా
మంచి దేవుడు తోడుండగా
ఆత్మహత్యలు వలదు
ఆత్మ ఆహుతి వలదు
బలము లేదని భంగపడకుమా
బలహీనుడనని బాధపడకుమా
ఓటమి చూచి వ్యసనపడకుమా
బలమైన దేవుడు తోడుండగా
నిరాశ నిస్పృహ వద్దు
సాగిపోవుటే ముద్దు