ప్రాణమిచ్చేంత ప్రేమ నాపై చూపుటకు
ఏముందయ్యా నాలో ఏముందయ్యా
తులువలనైన నాకై విలువైన రక్తం
వేల చెల్లించేంత ప్రేమ ఎందుకేసయ్యా ||2||

కొలతే లేదు కరుణించుటకు
పరిమితులే లేవు ప్రేమ చూపుటకు

పాపమును ద్వేషించే నీవు
పాపినైన నన్ను ప్రేమించితివే
పాపాన్ని అసహ్యించే నీవు
ఈ పాపి లోపాలను ఓర్చుకుంటివే
పరిశుద్ధుడవై నీవీ పాపి చెలిమి కోరుటకు
ఎందుకయ్యా ఈ ఆరాటము
నను వెదకి వెంటాడి ప్రేమించుటకు
ఏం ఉందయ్యా ఏమి చేసానయ్య
నిన్ను సేవించెదను నీ మాదిరిలోనే
నీ ప్రేమలోనే జీవించెదను
నిన్ను ప్రకటించెదను నా జీవితమంతా
నీ సేవలోనే కొనసాగెదను

www.christsquare.com