ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి – నెమ్మది నెమ్మదియే
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనందం – ఆనందమే
అద్భుతమే ఆశ్చర్యమే – ఆరాధనా ఆరాధనా

నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి – ఉల్లము పొంగెనయ్యా
మంచివాడా మంచి చేయువాడా – స్తోత్రము స్తోత్రమయా
మంచివాడా మహోన్నతుడా – ఆరాధనా ఆరాధనా

బలియైన గొఱ్ఱెగా – పాపములన్నిటిని మోసి తీర్చితివే
పరిశుద్ద రక్తము నా కొరకేనయ్యా – నాకెంతో భాగ్యమయ్యా
పరిశుద్దుడా – పరమాత్ముడా – ఆరాధనా ఆరాధనా

ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా – నిన్ను నేవిడవనయ్యా
రక్తము చిందిన సాక్షిగా యుందున్ – నిశ్చయం నిశ్చయమే
రక్షకుడా – యేసునాధా – ఆరాధనా ఆరాధనా

www.christsquare.com