నీతో వుంటే జీవితం - వేదనైన రంగుల పయనం
నీతో ఉంటే జీవితం - భాటేదైన పువ్వుల కుసుమం
నువ్వే నా ప్రాణాధారము
నువ్వే నా జీవధారము

నువ్వే లేకపోతే నేను జీవించలేను/ఊహించాలేను/సుఖించలేను
నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను/ నువ్వే లేకపోతే నేను లేనే లేను
నిను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము
చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం

నీతో నేను జీవిస్తానే కలకాలము
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
లోకంలో నేనెన్నో వెతిక అంతా శూన్యము - చివరికి నువ్వే నిలిచావే సదాకాలము //2//

నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణానాథా - నీ చేతితో మలచి నను విరచి సరిచేయు నాథ //2//

www.christsquare.com