సమర్ధవంతుడవైన నా యేసయ్యా
సమస్తము నీకు సాధ్యమేనయ్యా (2)
నా స్తుతి యాగము నీకే
నా ప్రాణార్పణ నీకే

నా సర్వస్వము నీకే
నా జీవన గానము నీకే
పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా
ఉంచువాడవు నీవే యేసయ్యా

ఆత్మ జలములను నవ్యముగా
ఇచ్చువాడవు నీవే యేసయ్యా (2)

నే వెళ్ళు మార్గమునందు నా పాదము జారకుండా (2) దూతల చేతులలో
నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా (2) నీ

శత్రువు చరలోనుండి నను భద్రముగా
నిల్పువాడవు నీవే యేసయ్యా
రక్షణ వస్త్రమును నిత్యము నాపై
కప్పువాడవు నీవే యేసయ్యా

జీవించు దినములన్నియు నాలో పాపము ఉండకుండా రక్తపు బిందువుతో
నన్ను కడుగువాడవు నీవే యేసయ్యా (2) నీ

www.christsquare.com