సన్నుతింతుమో ప్రభో
సదమలమగు భక్తితో
కన్న తండ్రి కావుమా
కలుషము నెడబాపుమా

నీతి సూర్య తేజమా
జ్యోతి రత్న రాజమా
పాతక జన రక్షకా
పతిత పావన నామకా

మానవ సంరక్షకా
దీన నిచయ పోషకా
దేవా మానవ నందనా
దివ్య సుగుణ మందనా

ప్రేమ తత్వ బోధకా
క్షేమ దాత వీవెగా
కామిత ఫలదాయక
స్వామి యేసు నాయక

పాప చింతలన్నిటిన్
పారదోలుమో ప్రభో
నీ పవిత్ర నామమున్
నిరతము స్మరియించెదన్

www.christsquare.com