సంతోష గీతం పాడెదను
యేసూ నీ ఘనతను చాటెదను
స్తోత్రము చెల్లింతును
నీ కీర్తి వినిపింతును

నా ప్రార్దన నీవెపుడు – త్రోసివేయలేదు
నా యెద్ద నుండి నీ కృపను – తీసివేయలేదు
నా విజ్ఞాపన అలించావు
నా మనవి అంగీకరించవు

సమృద్ది ఉన్న ప్రాంతానికి – నన్ను చేర్చినావు
తొట్రల్లకుండ స్తిరముగను – నిలువబెట్టినావు

నను బాగుగ పరిశీలించావు
నిర్మలునిగా రూపొందించావు

www.christsquare.com