శాశ్వత కృపను నేను తలంచగా
కానుకనైతిని నీ సన్నిధిలో
నా హృదయమెంతో జీవముగల దేవుని
దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది
నా దేహమెంతో నీకై ఆశించే

దూతలు చేయని నీ దివ్య సేవను
ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే
ధూపార్తిని చేపట్టి చేసెద

భక్తిహీనులతో నివసించుటకంటెను
నీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట
వేయిదినాల కంటే శ్రేష్టమైనది

సీయోను శిఖరాన సిలువ సితారతో
సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద
సీయోను రారాజువు నీవేగా

నూతనమైన ఈ జీవ మార్గమందున
నూతన జీవము ఆత్మాభిషేకమే
నూతన సృష్టిగా నన్ను మార్చెను

www.christsquare.com