శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె
కాచిన కృప ||శాశ్వతమైనది||

నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో

తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే
నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే

పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన
నా కృప నిను వీడదని అభయమిచ్చితివే

www.christsquare.com