శ్రేష్టమైన నామం – శక్తి గలిగిన నామం
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం
సాటిలేని నామం – స్వస్థపరచే నామం
అన్ని నామముల కన్నా నిత్యమైన నామం

యేసు నామం మధుర నామం
యేసు నామం సుమధుర నామం=
త్రోవ చూపి సరియైన దారిలో నన్ను నడిపించే నామం

దుష్ట శక్తులు బంధకములు తొలగించే
తరములెన్నో మారినా మనుజులంతా మారినా
మారని నామం మహిమ నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం

జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం
కలవరము నను వెంటాడినను ధైర్యమునిచ్చె ప్రభు నామం

భారమెంతో ఉన్నను శాంతినొసగే దివ్య నామం
మారని నామం మహిమ నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం

www.christsquare.com