సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)
వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా

నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా
నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ- మోయలేక మోసావు

కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే

వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే
దూషించి అపహసించి హింసించిరా నిన్ను
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా

నాదు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే
నాదు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే

నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం
సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను

www.christsquare.com