స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా
శుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే (2)

నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే (2)
నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా (2)
కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||

రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి (2)
మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును
కోటి కోటి స్తోత్రం డాడి

నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి
ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి
కోటి కోటి స్తోత్రం డాడి

వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు
యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును
కోటి కోటి స్తోత్రం డాడి

www.christsquare.com