స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవుని
మనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము
ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే
ఆది అంతము లేనివాడు

మార్పు చెందని – మహనీయుడు
జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే
ఆకలి గొనిన వారిని – పోషించే – దయమాయుడు

గుండె చెదరిన వారిని – గాయపడిన వారినెల్ల
తన బాహుబలము చేత (2) – బాగుచేయు బలవంతుడు

www.christsquare.com