స్తుతియింతుము స్తోత్రింతుము
పావనుడగు మా పరమ తండ్రిని
నీ నామము రుజువాయే
నీ ప్రజలలో దేవా (2)
వర్ణింప మా తరమా
మహిమ కలిగిన నీ నామమును
మా ప్రభువా మా కొరకై
సిలువలో సమసితివి
మాదు రక్షణ కొరకై
రక్తమును కార్చిన రక్షకుడా
పరిశుద్ధ జనముగా
నిర్దోష ప్రజలనుగా
పరలోక తనయులుగా
పరమ కృపతో మార్చిన దేవా