సుడిగాలి రేగెను - అలలేమో లేచెను
అతిచిన్న దోనె నేనయా
యేసయ్యా నాతోడు ఉండరావయా ॥
1. లోకమనే సంద్రంలో పయనించే నేను
లోతైన సుడిగుండములో చిక్కుకొంటిని (2)
లోకాలనేలే సర్వాధికారి
లోపాల నెంచక దరిచేర్చగ రావా (2)
లేదు నాకు తోడు - శరణంటిని దేవా (2)
శరణంటిని దేవా.. ॥సుడి॥
2. శోధననే చీకట్లు ముసురుతున్న వేళలో
చుక్కాని విడిపోయి అల్లాడే నావలో (2)
సూర్యచంద్ర జగతిని సృష్టించిన దేవా
సిలువ జ్యోతితో నన్ను వెలిగించగ రావా (2)
నా దీక్కునీవే - కరుణించుము దేవా (2)
కరుణించుము దేవా.. ॥సుడి॥
3. ఎవరులేరు నాకు ఒంటరిని నేను
అందరు విడచిన అనాధను నేను (2)
ఆదరించి ఆదుకునే ఆశ్చర్య రూపా
అనుక్షణము నానావను కాపాడు దేవా (2)
అర్పింతు సర్వం అనుసరింతు నిన్నే (2)
అనుసరింతు నిన్నే ... ||సుడి||
(3 వ చరణం కొన్ని కారణాలవలన రికార్డు చేయబడలేదు)