ఉదయమాయె హృదయమా
ప్రభు యేసుని ప్రార్ధించవే
పదిలముగా నిను వదలకుండా
పడక నుండి లేపెనే
రాత్రి గడచిపోయెనే
రవి తూర్పున తెలవారెనే
రాజా రక్షకుడేసు దేవుని
మహిమతో వివరించవే
తొలుత పక్షులు లేచెనే
తమ గూటి నుండి స్తుతించెనే
తండ్రి నీవే దిక్కు మాకని
ఆకాశమునకు ఎగిరెనే
పరిశుద్ధుడా పావనుండా
పరంధాముడా చిరంజీవుడా
పగటియంతయు కాచి మము
పరిపాలించుము దేవుడా
తండ్రి దాతవు నీవని
ధరయందు దిక్కు ఎవరని
రాక వరకు కరుణ చూపి
కనికరించి బ్రోవుమా